అ‍మ్మాయిలు అదరహో | India win third ODI | Sakshi
Sakshi News home page

అ‍మ్మాయిలు అదరహో

Nov 16 2016 11:37 PM | Updated on Sep 4 2017 8:15 PM

అ‍మ్మాయిలు అదరహో

అ‍మ్మాయిలు అదరహో

మూడో వన్డేలోనూ బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ భారత అమ్మాయిలు అదరగొట్టారు.

మూడో వన్డేలోనూ భారత్‌దే గెలుపు 
విండీస్‌పై 3-0తో క్లీన్‌స్వీప్ 

విజయవాడ స్పోర్ట్స్ కీలక సమయంలో కేసియా నైట్ (94 బంతుల్లో 55 పరుగులు; 5 ఫోర్లు) ఆడిన అనవసరమైన స్వీప్ షాట్ విండీస్ కొంపముంచింది. బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ భారత అమ్మాయిలు అదరగొట్టారు. మూలపాడులో బుధవారం జరిగిన చివరి వన్డేలో మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత జట్టు 15 పరుగుల తేడాతో విండీస్‌పై విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. విండీస్ జట్టు 5 వికెట్లు చేతిలోఉన్నప్పుడు  20 బంతుల్లో 27 పరుగులు చేస్తే గెలిచేది.

ఈ తరుణంలో భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ రాజేశ్వరీ (4/34) చక్కటి బౌలింగ్‌తో విండీస్ ఆశలను ఆవిరి చేసింది.  భారత జట్టు బౌలింగ్‌తో పాటు అద్భుతమైన ఫీల్డింగ్ (మూడు రనౌట్లు) చేసింది. చివరి 11 పరుగుల వ్యవధిలో విండీస్ జట్టు వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోరుుంది. తుదకు 49.1 ఓవ ర్లలో 184 పరుగులకు ఆలౌటైంది.

అంతకుముందు టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకొని 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. వేద కృష్ణమూర్తి (79 బంతుల్లో 71 పరుగులు; 10 ఫోర్లు) అర్ధ సెంచరీ చేసింది. మిథాలీరాజ్ (15), దీప్తీ శర్మ (23), వైస్ కెప్టెన్ హర్మన్  ప్రీత్ (19), జులన్ గోస్వామి (18) ఫర్వాలేదనిపించారు. ఈనెల 18న విండీస్‌తో టి20 సిరీస్ తొలి మ్యాచ్ ఇదే గ్రౌండ్‌లో జరుగనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement