ఆక్లాండ్ టెస్ట్‌లో రెండో ఇన్సింగ్స్లో న్యూజిలాండ్ 105 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 407 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది.
ఆక్లాండ్ : ఆక్లాండ్ టెస్ట్‌లో రెండో ఇన్సింగ్స్లో న్యూజిలాండ్ 105 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 407 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. కాగా మూడో రోజు పిచ్ స్వభావం దారుణంగా మారిపోయింది. ఫలితంగా పదహారు వికెట్లు టప టప రాలిపోయాయి. టీమిండియా మూడో రోజు అనూహ్య రీతిలో 202 పరుగులకు ఆలౌటైతే, ఆ తర్వాత న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 105 పరుగులకు కుప్ప కూలింది.
టీమిండియా బ్యాట్స్‌మెన్ నిలదొక్కుకుంటే తప్ప ఈ పిచ్ మీద విజయం సాధించడం కష్ట సాధ్యమే. ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 72 మినహా మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. వాగ్నర్ నాలుగు వికెట్లు తీసుకుంటే, బౌల్ట్, సౌతీ మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో టేలర్ 41 పరుగులు మినహాయిస్తే ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. షమీ మూడు, జహీర్ రెండు, ఇశాంత్ రెండు వికెట్లు పడగొట్టారు.