భారత్ లక్ష్యం 360.. ఆసీస్తో రెండో వన్డే | India target 360 against Australia in second one day | Sakshi
Sakshi News home page

భారత్ లక్ష్యం 360.. ఆసీస్తో రెండో వన్డే

Oct 16 2013 5:11 PM | Updated on Sep 1 2017 11:41 PM

భారత్ లక్ష్యం 360.. ఆసీస్తో రెండో వన్డే

భారత్ లక్ష్యం 360.. ఆసీస్తో రెండో వన్డే

భారత్తో వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా మరోసారి పరుగుల మోత మోగించింది.

భారత్తో వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా మరోసారి పరుగుల మోత మోగించింది. ఏడు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారమిక్కడ జరుగుతున్న రెండో మ్యాచ్లో  (డే/నైట్) ఆసీస్ 360 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కంగారూలు.. టాపార్డర్ బ్యాట్స్మెన్ సమష్టిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 359 పరుగులు సాధించింది.

జార్జి బెయిలీ (50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 92 నాటౌట్), ఫిలిప్ హ్యూస్ (83), షేన్ వాట్సన్ (59), మ్యాక్స్వెల్ (53), అరోన్ ఫించ్ (50) అర్ధశతకాలతో విజృంభించారు. మ్యాచ్ ఆరంభం నుంచే కంగారూలను కట్టడి చేయడంలో భారత బౌలర్లు చేతులెత్తేశారు. వినయ్ కుమార్ రెండు వికెట్లు తీసినా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఆసీస్ రన్రేట్ క్రమేణా పెరుగుతూ పోయింది. 40 ఓవర్లలో స్కోరు 237/3కు చేరుకుంది. చివరి పది ఓవర్లలో బెయిలీ, మ్యాక్స్వెల్ దూకుడుగా ఆడటంతో ఏకంగా 122 పరుగులు వచ్చాయి. ధోనీసేన లక్ష్యాన్ని ఛేదించాల్సివుంది. తొలి వన్డేల ఆసీస్ గెలిచిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement