భారత్‌కే మళ్లీ ప్రపంచ కప్ : సచిన్! | India can win World Cup: sachin Tendulkar | Sakshi
Sakshi News home page

భారత్‌కే మళ్లీ ప్రపంచ కప్ : సచిన్!

Nov 8 2014 1:03 PM | Updated on Sep 2 2017 4:06 PM

భారత్‌కే మళ్లీ ప్రపంచ కప్ : సచిన్!

భారత్‌కే మళ్లీ ప్రపంచ కప్ : సచిన్!

ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్ షిప్ను భారత్ గెలుచుకుంటుందని భారత మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జోస్యం చెప్పారు.

లండన్ : ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్ షిప్ను భారత్ గెలుచుకుంటుందని భారత మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జోస్యం చెప్పారు. చేశారు. స్పిన్నర్లే భారత్కు మరో కప్ అందిస్తారని ఆయన శనివారమిక్కడ అన్నారు. పేస్ బౌలర్లుకు సహకరించే ఆస్ట్రేలియా పిచ్లపై భారత స్నిన్నర్లు రాణిస్తారని సచిన్ పేర్కొన్నారు. ప్రపంచ కప్ రేసులో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు కూడా ఉన్నాయని అన్నారు. టీమిండియా ప్రపంచ కప్ గెలుస్తుందని తనతోపాటు, ప్రజలు విశ్వస్తున్నారని ఆయన తెలిపారు.

కాగా  ప్రపంచ కప్ 2015 టోర్నీకు మరికొద్ది నెలలు మాత్రమే ఉండటంతో క్రికెట్ జట్లు అన్ని కాంబినేషన్‌పై దృష్టి పెట్టాయి. ప్రపంచ కప్‌ కోసం పటిష్టమైన జట్టును రెడీ చేయడానికి పోటీ పడుతున్నాయి. మరోవైపు 2015 వరల్డ్ కప్ వన్డే క్రికెట్ షెడ్యూల్ ను ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఫిబ్రవరి 14న తొలి మ్యాచ్ జరగనుంది.

 

ఫిబ్రవరి 15న పాకిస్తాన్తో భారత్ ఆడనుంది. ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికాతో, ఫిబ్రవరి 28న యూఏఈతో, మార్చి 6న వెస్టిండీస్ తో, మార్చి 10న ఐర్లాండ్ తో, మార్చి 14న జింబాంబ్వేతో భారత్ మ్యాచ్ లు జరగనున్నాయి. మార్చి 24,26 తేదీల్లో సేమీ ఫైనల్ మ్యాచ్ లు ,మార్చి 29న మెల్ బోర్న్లో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement