న్యూజిలాండ్తో ఐదు వన్డేల సిరీస్ను భారత మహిళల జట్టు 3-2తో గెల్చుకుంది.
బెంగళూరు: న్యూజిలాండ్తో ఐదు వన్డేల సిరీస్ను భారత మహిళల జట్టు 3-2తో గెల్చుకుంది. చివరి, ఐదో వన్డేలో భారత్ జట్టు 9 వికెట్లతో ఘనవిజయం సాధించి సిరీస్ను సొంతం చేసుకుంది.
బుధవారం బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్ 41 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బేట్స్ (42) మినహా ఇతర క్రీడాకారిణులు విఫలమయ్యారు. భారత బౌలర్లు జులన్ గోస్వామి, గైక్వాడ్, దీప్తి శర్మ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యసాధనలో భారత్ 27.2 ఓవర్లలో కేవలం వికెట్ కోల్పోయి విజయాన్నందుకుంది. కామిని (62 నాటౌట్), దీప్తి శర్మ (44 నాటౌట్) రాణించారు.