
తిరువనంతపురం: అండర్–19 నాలుగు జట్ల క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ ‘బి’ జట్టు విజేతగా నిలిచింది. భారత్ ‘ఎ’ జట్టుతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ ‘బి’ జట్టు 72 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత భారత్ ‘బి’ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 232 పరుగులు సాధించింది.
హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ (38; 3 ఫోర్లు)తోపాటు రాహుల్ చంద్రోల్ (70; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), సమీర్ రిజ్వీ (67; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. అనంతరం భారత్ ‘ఎ’ జట్టు 38.3 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. భారత్ ‘బి’ బౌలర్లలో సుశాంత్ మిశ్రా (4/41), కరణ్ లాల్ (3/25) ఆకట్టుకున్నారు.