విన్నింగ్‌ టీమ్‌తోనే బరిలోకి.. | IND VS WI 2nd T20: Team India Playing With Same Team | Sakshi
Sakshi News home page

రెండో టీ20: విన్నింగ్‌ టీమ్‌తోనే బరిలోకి..

Dec 8 2019 6:46 PM | Updated on Dec 8 2019 6:55 PM

IND VS WI 2nd T20: Team India Playing With Same Team - Sakshi

తిరువనంతపురం : మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో పర్యాటక వెస్టిండీస్‌ జట్టుపై ఘనవిజయం సాధించిన టీమిండియా జోరు మీదుంది. ఇదే జోరులో రెండో టీ20 కూడా గెలిచేసిన సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఆదివారం స్థానిక మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన విండీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. టీమిండియా గత విన్నింగ్‌ టీమ్‌నే కొనసాగిస్తుండగా.. విండీస్‌ ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. వికెట్‌ కీపర్‌ దినేశ్‌ రామ్‌దిన్‌ను పక్కకు పెట్టి నికోలస్‌ పూరన్‌ను తుదిజట్టులోకి తీసుకున్నారు. 

అయితే అందరూ ఊహించనట్టుగా టీమిండియాలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్‌ కుమార్‌లకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మరో అవకాశం ఇవ్వాలని భావించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విన్నింగ్‌ టీమ్‌ను మార్చకూడదనే భావనలో కూడా ఉండటంతో భువీ, సుందర్‌లకు ఊరట లభించింది. ఇక ఈ మ్యాచ్‌లోనైనా రిషభ్‌ పంత్‌ రాణించాలని అతడి అభిమానులతో పాటు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. సంజూ శాంసన్‌ రూపంలో బలమైన పోటీ ఉన్న నేపథ్యంలో పంత్‌పై తీవ్ర ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.

తుది జట్లు
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్, రిషభ్‌ పంత్, శ్రేయస్‌ అయ్యర్, శివమ్‌ దూబే, జడేజా, యజువేంద్ర చహల్, వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్, భువనేశ్వర్‌.  
వెస్టిండీస్‌: కీరన్‌ పొలార్డ్‌ (కెప్టెన్‌), సిమన్స్‌, బ్రాండన్‌ కింగ్, నికోలస్‌ పూరన్, కాట్రెల్, ఎవిన్‌ లూయిస్, హెట్‌మైర్, కారీ పియరీ, హోల్డర్, హేడెన్‌ వాల్ష్‌, కాస్రిక్‌ విలియమ్స్‌.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement