రోహిత్‌ శర్మ ‘సెంచరీ’ | Ind Vs Ban: Rohit Set To Overtake Afridi in Rajkot T20I | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మ ‘సెంచరీ’

Nov 7 2019 12:33 PM | Updated on Nov 7 2019 4:10 PM

Ind Vs Ban: Rohit Set To Overtake Afridi in Rajkot T20I - Sakshi

రాజ్‌కోట్‌: ప్రపంచ క్రికెట్‌లో రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్న టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మరో అరుదైన ఘనతను సాధించేందుకు సిద్ధమయ్యాడు. అంతర్జాతీయ టీ20ల్లో వందో మ్యాచ్‌ను  ఆడనున్నాడు. గురువారం బంగ్లాదేశ్‌తో జరుగనున్న రెండో టీ20లో రోహిత్‌ ఈ మార్కును చేరనున్నాడు. ఇప్పటివరకూ 99 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌.. మరొక మ్యాచ్‌ ఆడితే పాకిస్తాన్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ షాహిద్‌ ఆఫ్రిదిని అధిగమిస్తాడు. ఆఫ్రిది తన కెరీర్‌లో 99 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. ఇక ఈ జాబితాలో పాకిస్తాన్‌కే చెందిన షోయబ్‌  మాలిక్‌(111) అగ్రస్థానంలో ఉన్నాడు.(ఇక్కడ చదవండి: సమం చేసే పనిలో భారత్‌)

పురుషుల క్రికెట్‌లో అత్యధిక ఇంటర్నేషనల్‌ టీ20లు ఆడిన క్రికెటర్లలో మాలిక్‌ తర్వాత స్థానాన్ని రోహిత్‌ ఆక్రమిస్తాడు. అదే సమయంలో పురుషులు-మహిళా క్రికెటర్ల పరంగా చూస్తే భారత్‌ తరఫున ఈ ఫీట్‌ సాధించిన రెండో క్రికెటర్‌గా నిలుస్తాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో భారత మహిళా క్రికెటర్‌ హర‍్మన్‌ప్రీత్‌ కౌర్‌ వందో టీ20ని పూర్తి చేసుకున్నారు. పురుషులు-మహిళా జట్ల క్రికెటర్ల జాబితాలో రోహిత్‌ది 12వ స్థానం అవుతుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 ద్వారా ఎంఎస్‌ ధోని రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేసిన సంగతి తెలిసిందే. వరల్డ్‌కప్‌ తర్వాత క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ధోని.. 98 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement