ప్రియాంకకు ప్రతిభ పురస్కారం | Gymnast Priyana gets Pratibha Puraskaram | Sakshi
Sakshi News home page

ప్రియాంకకు ప్రతిభ పురస్కారం

Jun 3 2018 10:36 AM | Updated on Jun 3 2018 10:36 AM

Gymnast Priyana gets Pratibha Puraskaram - Sakshi

ప్రియాంకకు అవార్డును ప్రదానం చేస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడల్లో రాణిస్తున్న వర్ధమాన క్రీడాకారులకు శనివారం అవార్డులను అందజేశారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిమ్నాస్టిక్స్‌లో ప్రతిభ కనబరుస్తోన్న కె. ప్రియాంక చౌదరి ప్రతిభా పురస్కారాన్ని గెలుచుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఎం. రఘునందన్‌ రావు, రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భాగవత్‌ చేతుల మీదుగా ఆమె ప్రతిభా పురస్కారాన్ని అందుకుంది. ఉత్తమ స్పో ర్ట్స్‌ పర్సన్‌ అవార్డుతోపాటు ఆమెకు రూ. 51,116 నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ తనను ప్రోత్స హించిన కోచ్‌ పులి రవీందర్‌ కుమార్‌ (సాయ్‌), రంగారెడ్డి జిల్లా జిమ్నాస్టిక్స్‌ సంఘం డీవైఎస్‌ఓ వెంకటేశ్వర రావుకు కృతజ్ఞతలు తెలిపింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement