అసిస్టెంట్ కోచ్గా గిలెస్పీ | Gillespie named Australia T20 assistant coach | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్ కోచ్గా గిలెస్పీ

Dec 29 2016 12:17 PM | Updated on Sep 4 2017 11:54 PM

అసిస్టెంట్ కోచ్గా గిలెస్పీ

అసిస్టెంట్ కోచ్గా గిలెస్పీ

ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ జాసన్ గిలెస్పీ ఆ దేశ ట్వంటీ 20 జట్టుకు అసిస్టెంట్ కోచ్గా ఎంపికయ్యాడు.

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ జాసన్ గిలెస్పీ ఆ దేశ ట్వంటీ 20 జట్టుకు  అసిస్టెంట్ కోచ్గా ఎంపికయ్యాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగే మూడు ట్వంటీ 20ల సిరీస్ ద్వారా గిలెప్పీ తన పర్యవేక్షణ బాధ్యతలను తీసుకోనున్నాడు. ఇటీవల ఆసీస్ టీ 20 జట్టుకు జస్టిన్ లాంగర్ను కోచ్ గా ఎంపిక చేయగా, తాజాగా టీ 20 జట్టుకు గిలెస్పీకి అసిస్టెంట్ కోచ్గా బాధ్యతలు అప్పజెప్పారు.

ఆసీస్ జట్టు ఉన్నతిలో భాగంగా తనకు అప్పజెప్పిన బాధ్యతపై గిలెప్సీ హర్హం వ్యక్తం చేశాడు. ' ఆసీస్ జట్టుతో పాలుపంచుకునే అవకాశం కల్పించినందుకు నిజంగా సంతోషం. నా పాత్ర పోషించేందుకు చాలా ఆతృతగా ఉన్నాను'అని గిలెస్పీ పేర్కొన్నాడు. తన టెస్టు కెరీర్లో 71 మ్యాచ్లు ఆడిన గిలెస్పీ. 259 వికెట్లు  సాధించగా, 97 వన్డేల్లో 142 వికెట్లు తీశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement