Gillespie
-
కోహ్లిని స్లెడ్జ్ చేయొద్దు..కానీ!
సిడ్నీ:ఆస్ట్రేలియాతో సిరీస్ అంటేనే ప్రత్యర్థి జట్టుకు గుర్తొచ్చేది స్లెడ్జింగ్. క్రికెటర్లను స్లెడ్జింగ్ చేయడంలో ఆసీస్ కు ఆ జట్టే సాటి. అయితే విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టుతో పరిమిత ఓవర్ల సిరీస్ ను ఆడేందుకు వచ్చిన ఆసీస్ ను ఆ జట్టు మాజీ పేసర్ జాసన్ గిలెస్పీ ముందుగా హెచ్చరించారు. ప్రపంచ క్రికెట్ లో పరుగుల మెషీన్ గా దూసుకుపోతున్న విరాట్ కోహ్లితో జాగ్రత్తగా ఉండాలంటూ ఆసీస్ ను మేలుకొల్పే యత్నం చేశారు. మ్యాచ్ లో కోహ్లిపై స్లెడ్జింగ్ కు దిగితే అతను బౌలర్లపై దూకుడు పెంచుతాడని, అలా కాకుండా వరుసగా బౌన్సర్లు విసిరి అతను క్రీజ్ లో క్రీజ్ లో వెనక్కి తగ్గేలా చేయాలని గిలెస్పీ సూచించాడు. 'కోహ్లి అసాధారణ ఆటగాడు. పవర్ ప్లేలో పరుగులు రాబట్టడంలో కోహ్లిది ప్రత్యేక స్థానం. ఎట్టిపరిస్థితుల్లోనూ కోహ్లితో స్లెడ్జ్ చేయొద్దు. కోహ్లితో ఆసీస్ ఆటగాళ్లు మాటల యుద్ధానికి తిగుతారని అనుకోవడం లేదు. అతనితో వాగ్వాదానికి దిగకుండా బౌలింగ్ తోనే అతన్ని కవ్వించే యత్నించండి. బౌన్సర్లతో కోహ్లిని రెచ్చగొట్టండి. ఆ క్రమంలోనే పరుగులు రాబట్టకుండా చూసుకోండి. పరుగులు సాధించే క్రమంలో కోహ్లి తప్పు చేయొచ్చు. బౌన్సర్లతో పాటు వికెట్లను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ వేయండి. కోహ్లి త్వరగా అవుటైతే.. భారత జట్టుపై ఒత్తిడి పెరుగుతుంది'అని గిలెస్పీ అభిప్రాయపడ్డారు. -
'టీమిండియా కోచ్ గా చేయాలని ఉంది'
సిడ్నీ: భవిష్యత్తులో భారత క్రికెట్ జట్టుకు కోచ్ పదవి కోసం దరఖాస్తు చేస్తానని ఆసీస్ మాజీ బౌలర్ జాసన్ గిలెస్పీ స్పష్టం చేశాడు. భారత్ కోచ్ గా రవిశాస్త్రి ఎంపికైన తరువాత గిలెస్పీ తన మనసులో మాటను వెల్లడించాడు. భారత క్రికెట్ కోచ్ గా చేయడమనేది చాలా గొప్పదిగా అభివర్ణించిన గిలెస్పీ.. తాజాగా ఆ బాధ్యతను తీసుకున్న రవిశాస్త్రికి అభినందనలు తెలియజేశాడు. 'కోచ్ గా ఎంపికైన రవిశాస్త్రికి అభినందనలు. టీమిండియా కోచ్ అనేది చాలా పెద్ద జాబ్. నాకు కూడా భారత జట్టుకు కోచ్ గా చేయాలని ఉంది. ఈసారి అందుకోసం దరఖాస్తు చేసే అంశంపై సరైన నిర్ణయం తీసుకోలేకపోయా. దీనిపై కుటుంబ సభ్యులతో చాలా తీవ్రంగా చర్చించాను కూడా. అయితే నిర్ణయం తీసుకోవడంలో విఫలమయ్యా. భవిష్యత్తులో టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేసే అంశాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తా. ఏదొక రోజు భారత క్రికెట్ కోచ్ అవుతాననే నమ్మకం కూడా ఉంది' గిలెస్పీ అన్నాడు. 1996 నుంచి 2006 వరకూ ఆసీస్ తరపున గిలెస్పీ కీలక పాత్ర పోషించాడు. ఈ కుడి చేతివాటం బౌలర్ 71 టెస్టు మ్యాచ్ ల్లో 259 వికెట్లు సాధించగా, 97 వన్డేల్లో 142 వికెట్లు తీశాడు. -
అసిస్టెంట్ కోచ్‌గా గిలెస్పీ
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ జాసన్ గిలెస్పీ ఆ దేశ ట్వంటీ 20 జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగే మూడు ట్వంటీ 20ల సిరీస్ ద్వారా గిలెప్పీ తన పర్యవేక్షణ బాధ్యతలను తీసుకోనున్నాడు. ఇటీవల ఆసీస్ టీ 20 జట్టుకు జస్టిన్ లాంగర్‌ను కోచ్ గా ఎంపిక చేయగా, తాజాగా టీ 20 జట్టుకు గిలెస్పీకి అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. ఆసీస్ జట్టు ఉన్నతిలో భాగంగా తనకు అప్పజెప్పిన బాధ్యతపై గిలెప్సీ హర్హం వ్యక్తం చేశాడు. ' ఆసీస్ జట్టుతో పాలుపంచుకునే అవకాశం కల్పించినందుకు నిజంగా సంతోషం. నా పాత్ర పోషించేందుకు చాలా ఆతృతగా ఉన్నాను'అని గిలెస్పీ పేర్కొన్నాడు. తన టెస్టు కెరీర్లో 71 మ్యాచ్‌లు ఆడిన గిలెస్పీ. 259 వికెట్లు సాధించగా, 97 వన్డేల్లో 142 వికెట్లు తీశాడు.