భారత బ్యాడ్మింటన్‌ సీనియర్‌ జట్టులో గాయత్రి  | Gayatri Is Part Of The Indian Badminton Senior Team | Sakshi
Sakshi News home page

భారత బ్యాడ్మింటన్‌ సీనియర్‌ జట్టులో గాయత్రి 

Feb 2 2020 3:59 AM | Updated on Feb 2 2020 3:59 AM

Gayatri Is Part Of The Indian Badminton Senior Team - Sakshi

న్యూఢిల్లీ: ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను ప్రకటించారు. ఈనెల 11 నుంచి 16 వరకు ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో ఈ టోర్నీ జరుగుతుంది. భారత స్టార్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు. పురుషుల విభాగంలో మాత్రం భారత అగ్రశ్రేణి క్రీడాకారులందరూ పాల్గొంటున్నారు. కొంతకాలంగా జూనియర్‌స్థాయిలో నిలకడగా రాణిస్తోన్న చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కుమార్తె గాయత్రి మహిళల సీనియర్‌ జట్టులో చోటు దక్కించుకుంది. మరో తెలుగమ్మాయి, డబుల్స్‌ స్పెషలిస్ట్‌ కె.మనీషా కూడా భారత జట్టులోకి ఎంపికైంది.
పురుషుల జట్టు: సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్‌ ప్రణయ్, శుభాంకర్‌ డే, లక్ష్య సేన్, సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి, ధ్రువ్‌ కపిల, ఎం.ఆర్‌.అర్జున్‌. మహిళల జట్టు: అష్మిత చాలిహ, ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్, గాయత్రి గోపీచంద్, అశ్విని భట్, శిఖా గౌతమ్, రుతుపర్ణ పాండా, కె.మనీషా.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement