రాఖీ పండగ: ఆదర్శంగా నిలిచిన గంభీర్‌..! | Gautam Gambhir Respect Transgenders On Raksha Bandhan | Sakshi
Sakshi News home page

Aug 27 2018 9:49 AM | Updated on Aug 27 2018 11:37 AM

Gautam Gambhir Respect Transgenders On Raksha Bandhan - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్‌ వినూత్న నిర్ణయాలతో ఆదర్శంగా నిలుస్తున్నాడు. రక్షా బంధన్‌ సందర్భంగా ట్రాన్స్‌జెండర్లతో రాఖీ కట్టించుకుని సమాజానికి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘ఆడా, మగా అనే లింగభేదం ఎందుకు. ముందు మనుషులుగా మసలుకోవడం ప్రధానం. అభినా అహెర్‌, సిమ్రాన్‌ షైక్‌ ప్రేమతో నా చేతికి కట్టిన రాఖీలు ఎప్పుడూ గుర్తుంటాయి’అని అని ట్విటర్‌లో పేర్కొన్నారు. వారిద్దరి సోదర ప్రేమను నేను అంగీకరించాను. మీరు అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. మనుషులను మనుషులుగా గౌరవించడం మనందరి బాధ్యత అని అన్నారు. ట్రాన్స్‌జెండర్లయినా.. వారూ మనుషులేనని చెప్తూ.. లింగమార్పిడి చేయించుకున్న వారిపట్ల అమానుషంగా ప్రవర్తించే కొందరికి ఆయన హితవు పలికారు. కేరళలో జరుపుకునే ఓనమ్ పండుగకు క్రికెటర్లంతా.. శుభాకాంక్షలు తెలుపుతుంటే భారతదేశ వ్యాప్తంగా జరుపుకునే రాఖీ పండుగకు గంభీర్ ఇలా స్పందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement