‘ధోని వల్లే మిగతా ఆటగాళ్లపై ఒత్తిడి’

Gambhirs stinging comment for MS Dhoni - Sakshi

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌ గడ్డపై పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని విమర్శలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ‘ఫినిషర్’పై సోషల్ మీడియా వేదికగా అభిమానులు విరుచుకుపడుతుండగా.. సునీల్ గావస్కర్‌ లాంటి దిగ్గజ క్రికెటర్‌ సైతం సుతి మెత్తగా విమర్శలు గుప్పించాడు. తాజాగా ఈ జాబితాలో భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చేరాడు. ఎంఎస్‌ ధోని ఆట తీరు కారణంగానే ప్రస్తుతం జట్టుపై ఒత్తిడి పెరుగుతోందంటూ చురకలు అంటించాడు.

‘ఇంగ్లండ్ గడ్డపై ఇటీవల ముగిసిన మూడు వన్డేల్లోనూ ధోని ఆట తీరున ఓసారి పరిశీలిస్తే.. అతను చాలా డాట్‌బాల్స్ ఆడిన విషయంగా స్సష్టంగా కనబడుతోంది. జట్టు కష్టాల్లో నిలిచిన దశలో అతను అలా ఆడటంతో.. మిగతా బ్యాట్స్‌మెన్‌పై విపరీతంగా ఒత్తిడి పెరుగుతోంది. అతను బ్యాటింగ్‌లో చురుగ్గా వ్యవహరించాల్సి ఉంది’ అని గంభీర్ పేర్కొన్నాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top