పాక్, శ్రీలంక టెస్టు నాలుగో రోజు వర్షార్పణం

రావల్పిండి: రాత్రి కురిసిన వర్షం, వెలుతురులేమి కారణంగా... పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య నాలుగో రోజు ఆట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. పదేళ్ల తర్వాత పాక్ గడ్డపై తొలి టెస్టు జరుగుతున్న నేపథ్యంలో నాలుగో రోజు ఆట జరిగేందుకు మైదానం సిబ్బంది శాయశక్తులా కృషి చేసినా ఫలితం కనిపించలేదు. దాంతో రెండు జట్ల ఆటగాళ్లు హోటల్‌లోనే ఉండిపోయారు. ఈ టెస్టుకు తొలి రోజు నుంచి వర్షం, వెలుతురులేమి ఆటంకం కలిగించింది. తొలి రోజు 68.1 ఓవర్ల ఆట... రెండో రోజు 18.2 ఓవర్ల ఆట... మూడో రోజు 5.2 ఓవర్ల ఆట సాధ్యమైంది. నాలుగో రోజు ఒక్క బంతి కూడా పడలేదు. ఇప్పటికీ శ్రీలంక తొలి ఇన్నింగ్స్ కూడా పూర్తి కాకపోవడంతో మ్యాచ్ ‘డ్రా’ కావడం లాంఛనమే.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి