ఫిఫా ప్రపంచకప్‌: మరో రెండు జట్లు ఔట్‌

FIFA World Cup Morocco And Iran Out Of The Tourney - Sakshi

మొరాకో, ఇరాన్‌ జట్లు టోర్నీ నుంచి ఔట్‌

ఇది వరకే సౌదీ అరేబియా, ఈజిప్ట్‌ జట్ల నిష్ర్కమణ

మాస్కో: ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్‌ బి నుంచి స్పెయిన్‌, పోర్చుగల్‌ నాకౌట్‌ దశకు చేరుకున్నాయి. సోమవారం గ్రూప్‌ బిలో   భాగంగా జరిగిన రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఎక్సట్రా ఇంజ్యూరీ సమయంలో గోల్‌ చేసి పోర్చుగల్‌తో మ్యాచ్‌ను ఇరాన్‌ డ్రాగా ముగించింది. మరో మ్యాచ్‌లో మొరాకాతో జరిగిన మ్యాచ్‌ను స్పెయిన్‌ 2-2తో డ్రా చేసింది. దీంతో గ్రూప్‌ దశలో ఒక్క విజయం సాధించని మొరాకోతో పాటు పోర్చుగల్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న ఇరాన్‌ జట్లు టోర్నీ నుంచి నిష్ర్కమించాయి. ఇప్పటికే గ్రూప్‌ ఏ నుంచి సౌదీ ఆరేబియా, ఈజిప్ట్‌ జట్లు టోర్నీ నుంచి నిష్ర్కమించిన విషయం తెలిసిందే.

చివరి నిమిషంలో గోల్‌..
మరో రెండు నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుంది.. పోర్చుగల్‌  గెలుస్తుందనుకున్న తరుణంలో ఇరాన్‌ జట్టు మాయ చేసింది. పెనాల్డీ రూపంలో వచ్చిన అదృష్టాన్ని ఉపయోగించుకుంది. ఇరాన్‌ ఆటగాడు కరీమ్‌ (90+3 నిమిషంలో)గోల్‌ చేసి మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించాడు. అంతకముందు తొలి అర్ధ భాగంలోనే పోర్చుగల్‌ స్టార్ మిడ్‌ఫీల్డర్ రికార్డో క్వారెస్మా తొలి గోల్‌(44వ నిమిషంలో) నమోదు చేశాడు. పోర్చుగల్‌ అటాకింగ్‌ గేమ్‌ ఆడతూ గోల్‌ పోస్ట్‌పై దాడి చేయగా ఇరాన్‌ రక్షణశ్రేణి సమర్ధవంతంగా అడ్డుకుంది. మ్యాచ్‌లో పోర్చుగల్‌ 14సార్లు గోల్‌ కోసం ప్రయత్నించగా, ఇరాన్‌ ఎనిమిది సార్లు ప్రయత్నించింది. దీంతో గ్రూప్‌ బిలో రన్నరప్‌గా ఉన్న పోర్చుగల్‌ నాకౌట్‌ పోరులో బలమైన ఉరుగ్వేతో తలపడనుంది.

గ్రూప్‌-బి టాపర్‌ స్పెయిన్‌
గ్రూప్‌ బిలో మరో సమరం కూడా డ్రాగానే ముగిసింది. రసవత్తరంగా సాగిన స్పెయిన్‌, మొరాకో మ్యాచ్‌ 2-2తో డ్రా అయింది. రెండో అర్థభాగం ముగిసే సరికి 2-1తో ఆధిక్యంలో ఉన్న మొరాకోకు.. ఎక్సట్రా ఇంజ్యూరీ టైమ్‌లో స్పెయిన్‌ ఆటగాడు ఇయాగో ఆస్పస్‌ (90+1 నిమిషంలో) గోల్‌ చేసి మొరాకోకు షాక్‌ ఇచ్చాడు. అంతకముందు మొరాకో తరుపున ఖలీద్‌(13వ నిమిషంలో), ఎన్‌-నెస్రీ(80వ నిమిషంలో) గోల్స్‌ చేశారు. స్పెయిన్‌కు ఇస్కో(19వ నిమిషంలో)గోల్‌ అందించాడు. దీంతో ఒక్క విజయం, రెండు డ్రాలతో గ్రూప్‌ బి టాపర్‌గా స్పెయిన్‌ నాకౌట్‌లోకి ఆడుగుపెట్టనుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top