ఫుట్‌బాల్ ప్రపంచకప్‌తో జలంధర్‌కు పంట | FIFA World Cup: Jalandhar's sports industry gets bulk orders | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌తో జలంధర్‌కు పంట

Jun 13 2014 2:20 AM | Updated on Oct 2 2018 8:39 PM

బ్రెజిల్‌లో జరుగుతున్న ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీతో జలంధర్‌లోని క్రీడా పరిశ్రమ పంట పండనుంది. విదేశాల్లో డిమాండ్ పెరగడంతో పాటు దేశంలోనూ ఫుట్‌బాల్ ఫీవర్ ఊపందుకోవడంతో ఈ సీజన్‌లో సాకర్ బంతుల అమ్మకాలు 30 నుంచి 40 శాతం పెరిగేందుకు అవకాశం ఉందని ఈ పరిశ్రమ భావిస్తోంది.

చండీగఢ్: బ్రెజిల్‌లో జరుగుతున్న ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీతో జలంధర్‌లోని క్రీడా పరిశ్రమ పంట పండనుంది. విదేశాల్లో డిమాండ్ పెరగడంతో పాటు దేశంలోనూ ఫుట్‌బాల్ ఫీవర్ ఊపందుకోవడంతో ఈ సీజన్‌లో సాకర్ బంతుల అమ్మకాలు 30 నుంచి 40 శాతం పెరిగేందుకు అవకాశం ఉందని ఈ పరిశ్రమ భావిస్తోంది.
 
 వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు ఇక్కడ 10 లక్షల సాకర్ బంతులు తయారుకానున్నాయి. ఫిఫా ఆమోదం పొందిన 80 వేల ప్రమోషనల్ బంతులను జలంధర్‌కు చెందిన రతన్ బ్రదర్స్ కంపెనీ ఇప్పటికే బ్రెజిల్‌కు ఎగుమతి చేసింది. వీటితో పాటు రెండు లక్షల బంతుల్ని ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, హంగెరీ, న్యూజిలాండ్ దేశాలకు ఎగుమతి చేశామని రతన్ బ్రదర్స్ డెరైక్టర్ తిలక్ ఖిందర్ తెలిపారు. చిన్న పట్టణాల నుంచి కూడా విపరీతంగా ఆర్డర్స్ వస్తున్నాయని నివియా స్పోర్ట్స్ కంపెనీ పేర్కొంది. ఈ టోర్నీ ద్వారా అధిక లాభాలు గడించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement