ఇంగ్లండ్‌ క్లీన్‌స్వీప్‌

England thrash West Indies in third T20 international - Sakshi

చివరి టి20లోనూ విండీస్‌ ఓటమి

బాసెటెర్‌: వెస్టిండీస్‌ పర్యటనను ఇంగ్లండ్‌ క్లీన్‌స్వీప్‌తో ముగించింది. మూడు టి20ల సిరీస్‌ను ఇంగ్లండ్‌ 3–0తో కైవసం చేసుకుంది. ఆఖరి టి20లో ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 13 ఓవర్లలో 71 పరుగులే చేసి ఆలౌటైంది. నలుగురు బ్యాట్స్‌మెన్‌ క్యాంప్‌బెల్‌ (11), హోల్డర్‌ (11), పూరన్‌ (11), మెక్‌కాయ్‌ (10) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో డేవిడ్‌ విల్లే (4/7) కెరీర్‌ బెస్ట్‌ ప్రదర్శనతో విండీస్‌ను వణికించాడు.

వుడ్‌ 3, రషీద్‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత సునాయాస లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 10.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు బెయిర్‌స్టో 37, హేల్స్‌ 20 పరుగులు చేశారు. టి20ల చరిత్రలో విండీస్‌ చెత్తరికార్డును లిఖించుకుంది. వరుస మ్యాచ్‌ల్లో కనీసం 75 పరుగుల్లోపే ఆలౌటైన జట్టుగా నిలిచింది. రెండో టి20లో విండీస్‌ 45 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. విల్లేకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆల్‌రౌండర్‌ జోర్డాన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top