విష్ణు–సాయిలకు డబుల్స్‌ టైటిల్‌ | Doubles title for Vishnu-Sai | Sakshi
Sakshi News home page

విష్ణు–సాయిలకు డబుల్స్‌ టైటిల్‌

Dec 23 2018 1:14 AM | Updated on Dec 23 2018 1:14 AM

Doubles title for Vishnu-Sai - Sakshi

లక్నో: జాతీయ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌లో తెలంగాణ జోడి పి.విష్ణువర్ధన్‌ గౌడ్‌– పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్‌ సత్తా చాటింది. విష్ణు–సాయి జంట అండర్‌–19 బాలుర డబుల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సాయి కుమార్‌–విష్ణువర్ధన్‌ జోడి 21–11, 21–19తో రెండో సీడ్‌ మన్‌జీత్‌ సింగ్‌– డింకూ సింగ్‌ జంటపై గెలిచింది.

అంతకుముందు సెమీస్‌లో 21–7, 22–20తో ఆలాప్‌ మిశ్రా–ధ్రువ్‌ రావత్‌పై, క్వార్టర్స్‌లో 21–17, 21–16తో అమన్‌– యశ్‌పై నెగ్గి తెలంగాణ ఆటగాళ్లు ఫైనల్‌కు చేరారు. 

Advertisement
 
Advertisement
Advertisement