ధోనినా మజాకా.. మామూలుగా ఉండదు

Dhoni Makes Fun With Fans In This Video Shared By CSK - Sakshi

చెన్నై: టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌, చెన్నైసూపర్‌ కింగ్స్‌ సారథి ఎంఎస్‌ ధోనికి ఉన్న అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానం లోపల, బయట ధోని ప్రవర్తించే తీరుకు ఫ్యాన్స్‌ ఫిదా అవ్వాల్సిందే. ఈ కరోనా రక్కసి లేకుంటే ఇప్పటికే ఐపీఎల్‌- 2020 తుది అంకానికి చేరుకునేది. కానీ కరోనా లాక్‌డౌన్‌తో అటు క్రికెటర్లు ఇటు అభిమానులు ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో మైదానంలో మిస్సవుతున్న వినోదాన్ని అందించేందుకు పలు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. 

ఈ జాబితాలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం ముందు వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సీఎస్‌కే ఆటగాళ్లకు సంబంధించి కొత్తకొత్త విషయాలను అభిమానులకు అందించే ప్రయత్నం చేస్తోంది. అంతేకాకుండా తమ సారథి ధోనికి ఉన్న ప్రత్యేక ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని అతడికి సంబంధించి కొత్త, పాత వీడియోలను, ఫోటోలు తమ అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేస్తోంది. దీనిలో భాగంగా తాజాగా ధోనికి సంబంధించి షేర్‌ చేసిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. 

ఈ వీడియలో హోటల్‌ నుంచి ధోనికి బయటకు వస్తూ అతడు పలికించి హావభావాల పట్ల నెటిజన్లు ఆకర్షితులవుతున్నారు. ముందుగా గేట్‌ దగ్గర  సెక్యూరిటీ చేసిన సెల్యూట్‌కు గౌరవమిస్తూనే.. అక్కడే ఉన్న అభిమానులకు తన చేతిలో ఉన్న ద్రాక్ష పళ్లను సరదాగా చూపించి బస్‌ ఎక్కాడు. కేవలం ఆరు సెక​న్ల నిడివిగల ఈ వీడియో ధోని ఫ్యాన్స్‌తో పాటు, నెటిజ్లను తెగ ఆకట్టుకుంటోంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇక అనేకమంది ధోని ఆటను మిస్సవుతున్నామని కామెంట్‌ రూపంలో తమ ఆవేదనను తెలుపుతున్నారు. ‘దనాదన్ ధోనీ.. చేతిలో ద్రాక్ష’ అంటూ మరికొంతమంది నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు.

చదవండి: 
'ఆ నిర్ణయం నా కెరీర్‌ను ముంచేసింది'
ఎన్టీఆర్‌కు వార్నర్‌ స్పెషల్‌ విషెస్!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top