ధోని వచ్చేశాడు... | Dhoni is back | Sakshi
Sakshi News home page

ధోని వచ్చేశాడు...

Sep 22 2015 11:49 PM | Updated on Sep 3 2017 9:47 AM

ధోని వచ్చేశాడు...

ధోని వచ్చేశాడు...

జాతీయ క్రికెట్ అకాడమీలో భారత క్రికెట్ జట్టు సందడి మొదలైంది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న

బెంగళూరు : జాతీయ క్రికెట్ అకాడమీలో భారత క్రికెట్ జట్టు సందడి మొదలైంది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సన్నాహక శిబిరంలో 30 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. వన్డే, టి20లకు జట్లకు ఎంపిక కాని క్రికెటర్లు కూడా ఈ ప్రాబబుల్స్ బృందంలో ఉన్నారు. దాదాపు మూడు నెలల విరామం తర్వాత మళ్లీ జట్టుతో చేరిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చాలా ఉత్సాహంగా కనిపించాడు. టెస్టు కెప్టెన్ కోహ్లి సహా గాయం నుంచి కోలుకుంటున్న ధావన్ కూడా క్యాంప్‌లో చేరాడు. టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రితో పాటు ముగ్గురు సహాయక కోచ్‌ల నేతృత్వంలో ఆటగాళ్లు శిక్షణలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement