ధావన్‌, అయ్యర్‌ హాఫ్‌ సెంచరీలు | Dhawan, Shreyas Half Centuries Help Delhi to 187 | Sakshi
Sakshi News home page

ధావన్‌, అయ్యర్‌ హాఫ్‌ సెంచరీలు

Apr 28 2019 5:44 PM | Updated on Apr 28 2019 5:46 PM

Dhawan, Shreyas Half Centuries Help Delhi to 187 - Sakshi

ఢిల్లీ: ఐపీఎల్‌లో భాగంగా ఇక్కడ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 188 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. శిఖర్‌ ధావన్‌(50; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌(52: 37 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీలు సాధించి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ తీసుకున్న ఢిల్లీ 35 పరుగుల వద్ద ఓపెనర్‌ పృథ్వీషా(18) వికెట్‌ను నష్టపోయింది. అటు తర్వత ధావన్‌కు జత కలిసిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ‍్యర్‌ నిలకడగా బ్యాటింగ్‌ చేశాడు. ఈ క్రమంలోనే ధావన్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ 68 పరుగులు జోడించిన తర్వాత ధావన్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు.

ఆ దశలో అయ్యర్‌కు జత కలిసిన రిషభ్‌ పంత్‌(7) ఎ‍క్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. చాహల్‌ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు పంత్‌. ఆపై కాసేపటికి అయ్యర్‌ కూడా ఔట్‌ కావడంతో ఢిల్లీ స్కోరులో వేగం తగ్గింది. కొలిన్‌ ఇన్‌గ్రామ్‌(11) ఒక సిక్స్‌, ఒక ఫోర్‌తో టచ్‌లోకి వచ్చినట్టు కనిపించినా నవదీప్‌ షైనీ బౌలింగ్‌లో ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. చివర్లో రూథర్‌ఫర్డ్‌(28 నాటౌట్‌; 1 ఫోర్‌, 3 సిక్సర్లు), అక్షర్‌ పటేల్‌(16 నాటౌట్‌; 3 ఫోర్లు) బ్యాట్‌ ఝుళిపించడంతో  ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 187 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లో చహల్‌ రెండు వికెట్లు సాధించగా, ఉమేశ్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, నవదీప్‌ షైనీలకు తలో వికెట్‌ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement