4 బంతుల్లో 3 వికెట్లు.. మళ్లీ చాహర్‌ మెరుపులు | Deepak Chahar 3 Wickets In 4 Balls | Sakshi
Sakshi News home page

4 బంతుల్లో 3 వికెట్లు.. మళ్లీ చాహర్‌ మెరుపులు

Nov 15 2019 11:04 AM | Updated on Nov 15 2019 11:10 AM

Deepak Chahar 3 Wickets In 4 Balls - Sakshi

దీపక్‌ చాహర్‌(ఫైల్‌ఫోటో)

తిరువనంతపురం: ఆదివారం అంతర్జాతీయ టి20లో హ్యాట్రిక్‌... మంగళవారం మూడు బంతుల్లో (వైడ్‌ను మినహాయించి) మూడు వికెట్లు... ఇప్పుడు గురువారం మళ్లీ అదే తరహా ప్రదర్శన! పేసర్‌ దీపక్‌ చాహర్‌ జోరు కొనసాగుతూనే ఉంది. ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో భాగంగా ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన చాహర్‌ నాలుగు బంతుల వ్యవధిలో   3 వికెట్లు పడగొట్టాడు.

చివరి ఓవర్లో మొదటి, మూడో, నాలుగో బంతులకు చాహర్‌కు ఈ 3 వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా యూపీ 9 వికెట్లకు 164 పరుగులు చేయగా, రాజస్తాన్‌ 17.2 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు సాధించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement