అప‍్పుడు ప్రపోజల్‌..ఇప్పుడు విషెస్‌ | Danielle Wyatt congratulates virat kohli on marrying Anushka Sharma | Sakshi
Sakshi News home page

అప‍్పుడు ప్రపోజల్‌..ఇప్పుడు విషెస్‌

Dec 12 2017 3:42 PM | Updated on Dec 12 2017 3:43 PM

Danielle Wyatt congratulates virat kohli on marrying Anushka Sharma - Sakshi

లండన్‌: గతంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్‌ డానియెల్లి యాట్‌ పెళ్లి ప్రపోజ్‌ చేసిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లి ఆటకు ఫిదా అయిపోయిందో లేక ఇద్దరి కెరీర్ ఒకటే అనుకుందేమోగానీ ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి మనోడ్ని పెళ్లి చేసుకుంటానంటూ సరదాగా ఓ ప్రతిపాదన చేసింది. దాదాపు మూడేళ్ల క్రితం'నన్ను పెళ్లి చేసుకుంటావా కోహ్లి' అని ట్వీట్‌ చేసి వార్తల్లో నిలిచింది డానియల్లి యాట్‌.

 ఆపై 2014లో టీమిండియా జట్టు ఇంగ్లండ్ లో పర్యటించినప్పుడు డానియెల్లికి కోహ్లి బ్యాట్‌ను కానుకగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దాంతో మురిసిపోయిన యాట్‌.. ఇక ఆ బ్యాట్‌తోనే క్రికెట్‌ ఆడతానడంటూ పేర్కొంది. కాగా, విరాట్‌ కోహ్లి వివాహం అనుష్క శర్మతో జరిగి పోవడంతో డానియెల్లి యాట్‌ స్పందించింది. ఇక చేసేది లేక కోహ్లికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేసింది. పెళ్లితో ఒక్కటైన కొత్త జంట కోహ్లి-అనుష్కలకు అభినందలు తెలిపింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement