ఇంగ్లండ్ పర్యటనకు స్టెయిన్ దూరం | Dale Steyn rules himself out of South Africa’s England tour | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ పర్యటనకు స్టెయిన్ దూరం

May 15 2017 6:30 PM | Updated on Sep 5 2017 11:13 AM

ఇంగ్లండ్ పర్యటనకు స్టెయిన్ దూరం

ఇంగ్లండ్ పర్యటనకు స్టెయిన్ దూరం

త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే దక్షిణాఫ్రికా జట్టు నుంచి ప్రధాన పేసర్ డేల్ స్టెయిన్ వైదొలిగాడు.

కేప్టౌన్: త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే దక్షిణాఫ్రికా జట్టు నుంచి ప్రధాన పేసర్ డేల్ స్టెయిన్ వైదొలిగాడు. ఇంకా భుజం గాయం నుంచి కోలుకోలేకపోవడంతో ఇంగ్లండ్ పర్యటనకు దూరంగా ఉంటున్నట్లు స్టెయిన్ పేర్కొన్నాడు. అయితే వచ్చే నెల్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో ఆడే విషయంలో మాత్రం స్టెయిన్ ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు.  గతేడాది నవంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో గాయం కారణంగా దూరమైన స్టెయిన్ అప్పట్నుంచి క్రికెట్ కు దూరంగానే ఉంటున్నాడు. అతని గాయం పదే పదే ఇబ్బంది పెడుతుండటంతో ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం ఆ సర్జరీ నుంచి కోలుకునే ప్రయత్నంలో స్టెయిన్ మరికొన్ని రోజులు పాటు సఫారీ జట్టుకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు.

 

'నేను గాయం నుంచి కోలుకుంటున్నా. తిరిగి క్రికెట్ ఫీల్డ్ లో అడుగుపెట్టడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చనే అనుకుంటున్నా. ప్రస్తుతం నేను చాలా పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నా. రన్నింగ్, జిమ్ వర్క్లు చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇంకా పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయడం లేదు. బౌలింగ్ కు ఇంకా రెఢీ కాలేదు'అని స్టెయిన్ పేర్కొన్నాడు.


 

Advertisement
 
Advertisement
Advertisement