మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు: రోహిత్‌

Bangladesh put us under pressure in the first 10 overs - Sakshi

దుబాయ్‌: ఆసియాకప్‌లో మరోసారి విజేతగా నిలవడం పట్ల టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. తుది పోరులో మిడిల్‌ ఆర్డర్‌దే కీలక పాత్రగా రోహిత్‌ పేర్కొన్నాడు. తమ జట్టు ఒత్తిడిలో పడ్డ సమయంలో మిడిల్‌ ఆర్డర్‌ ఆటగాళ్లు ఆకట్టుకుని విజయం ఖాయం చేశారన్నాడు. ఓవరాల్‌గా చూస్తే తమ ఫినిషింగ్‌ లైన్‌ అద్భుతంగా ఉందన్నాడు.

మ్యాచ్‌ తర్వాత రోహిత్‌ మాట్లాడుతూ.. ‘ ముందుగా బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ప్రధానంగా చూస్తే తొలి 10 ఓవర్లలో బంగ్లా ఆటగాళ్లు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. అయితే బంతి కాస్త పాత బడిన తర్వాత స్పిన్నర్లు రాణించే అవకాశం ఉందని ముందే ఊహించాం. మేము ఏదైతే అనుకున్నామో.. అదే జరిగింది. క్రమేపీ బంగ్లాను భారీ స్కోరు చేయకుండా పైచేయి సాధించాం.ఇక్కడ జట్టుగా సమష్టి కృషి లేకపోతే టైటిల్‌ను గెలవడం అంత ఈజీ కాదు. ఈ టైటిల్‌ సాధించడంలో క్రెడిట్ అంతా మొత్తం జట్టుదే. ఈ తరహా జట్టు ఉన్నప్పుడు కెప్టెన్‌ పాత్ర అనేది సులభతరంగానే ఉంటుంది.  మిగతా 10 ఆటగాళ్ల వల్లే నేను మంచి కెప్టెన్‌గా కనబడుతున‍్నా. టోర్నీ ఆద్యంతం మా వాళ్లు అసాధారణంగా రాణించారు. అదే సమయంలో మాకు మద్దతు కూడా విశేషంగా లభించింది. భారత్‌కు మద్దతు తెలిపిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.

‘ఆసియా’ మనదే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top