
మెల్‌బోర్న్: యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన ఇంగ్లండ్ జట్టు... రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి రెండు వికెట్లు తీసి మ్యాచ్‌పై పట్టు సాధిస్తున్న సమయంలో వర్షం అడ్డుపడటంతో ఆట నిలిచిపోయింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా మరో 61 పరుగులు వెనుకబడి ఉంది. కేవలం ఒక్క రోజు ఆట మాత్రమే మిగిలి ఉన్న ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 491 వద్దే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.