ఓపెనర్లకు బరిందర్ శరణ్ చెక్ | australia gets 40 runs by losing 2 wickets after 10 runs | Sakshi
Sakshi News home page

ఓపెనర్లకు బరిందర్ శరణ్ చెక్

Jan 12 2016 1:49 PM | Updated on Sep 3 2017 3:33 PM

ఓపెనర్లకు బరిందర్ శరణ్ చెక్

ఓపెనర్లకు బరిందర్ శరణ్ చెక్

ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆరంగేట్రం మ్యాచ్ లోనే టీమిండియా బౌలర్ బరిందర్ శరణ్ ఆకట్టుకున్నాడు.

పెర్త్:  ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా  ఆరంగేట్రం మ్యాచ్ లోనే టీమిండియా బౌలర్ బరిందర్ శరణ్ ఆకట్టుకున్నాడు. ఆసీస్ ఓపెనర్లు అరోన్ ఫించ్(8), డేవిడ్ వార్నర్(5)లను పెవిలియన్ కు పంపి సత్తా చాటుకున్నాడు. ఆసీస్ ఆందోళన చెందినట్లుగానే బరిందర్ పదునైన బంతులతో ఇబ్బంది పెట్టాడు.

 

తొలుత ఫించ్ ను పెవిలియన్ కు పంపిన బరిందర్.. ఆ తరువాత కొద్ది వ్యవధిలోనే వార్నర్ ను అవుట్ చేశాడు. దీంతో ఆసీస్ 10.0 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. టీమిండియా నిర్దేశించిన 310 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలోనే కీలక వికెట్లను కోల్పోవడంతో వారి శిబిరంలో ఆందోళన మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement