నాన్న కోసం ‘97’ | All-round Sarfaraz Khan steals show in ICC Under-19 World Cup opener | Sakshi
Sakshi News home page

నాన్న కోసం ‘97’

Feb 17 2014 1:16 AM | Updated on Sep 2 2017 3:46 AM

నాన్న కోసం ‘97’

నాన్న కోసం ‘97’

భారత యువ క్రికెట్‌లో తాజా సంచలనం సర్ఫరాజ్ ఖాన్. 16 ఏళ్ల ఈ ముంబై ఆటగాడు శనివారం అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌కు శుభారంభం అందించాడు.

దుబాయ్: భారత యువ క్రికెట్‌లో తాజా సంచలనం సర్ఫరాజ్ ఖాన్. 16 ఏళ్ల ఈ ముంబై ఆటగాడు శనివారం అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌కు శుభారంభం అందించాడు. 74 పరుగులు చేయడంతోపాటు ఒక వికెట్ తీసి, నాలుగు క్యాచ్‌లు కూడా పట్టుకున్నాడు.
 
 మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో అతను తన టీ షర్ట్ గురించి ఒక ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఇప్పటి వరకు జెర్సీ నంబర్ 86 వాడిన అతను ఈ వరల్డ్ కప్‌లో మాత్రం ‘97’తో బరిలోకి దిగాడు. తన కెరీర్‌ను తీర్చిదిద్దిన తండ్రిపై గౌరవంతో ఆయన్ను గుర్తు చేసే విధంగా నంబర్ మార్చానని సర్ఫరాజ్ చెప్పాడు. హిందీలో 9 (నౌ)...7 (సాత్) ... రెండూ పక్కనే కలిపి రాస్తే నౌసాత్ అవుతుంది. చదివేటప్పుడు అది తన తండ్రి ‘నౌషాద్’లా ధ్వనిస్తుందని, ఆయనపై ప్రేమతోనే అలా చేశానని సర్ఫరాజ్ చెప్పడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement