హాకీ ఇండియా, ఏఐఎఫ్‌ఎఫ్‌ విరాళం రూ. 25 లక్షలు | AIFF And Hockey India pledge to donate Rs 25 lakh each to fight COVID-19 | Sakshi
Sakshi News home page

హాకీ ఇండియా, ఏఐఎఫ్‌ఎఫ్‌ విరాళం రూ. 25 లక్షలు

Published Thu, Apr 2 2020 6:04 AM | Last Updated on Thu, Apr 2 2020 1:32 PM

AIFF And Hockey India pledge to donate Rs 25 lakh each to fight COVID-19 - Sakshi

న్యూఢిల్లీ: కరోనాపై పోరు కోసం చేతులు కలిపే వారి జాబితా తాజాగా హాకీ ఇండియా (హెచ్‌ఐ), అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) చేరాయి. పీఎం కేర్స్‌ సహాయ నిధి కోసం హెచ్‌ఐ, ఏఐఎఫ్‌ఎఫ్‌ చెరో రూ. 25 లక్షలు బుధవారం విరాళంగా ప్రకటించాయి.

గంగూలీ ఉదారత
కరోనా కారణంగా ఆహారం లేక ఇబ్బంది పడే వారిని ఆదుకునేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ముందుకొచ్చాడు. అతను బుధవారం రామకృష్ణ మిషన్‌ హెడ్‌కార్టర్స్‌ అయిన బేలూరు మఠానికి 2,000 కేజీల బియ్యాన్ని అందజేశాడు. ‘25 ఏళ్ల తర్వాత బేలూరు మఠాన్ని సందర్శించాను. అన్నార్థుల కోసం 2,000 కేజీల బియ్యాన్ని అప్పగించాను’ అని దాదా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement