క్వార్టర్స్‌లో అభయ, అపూర్వ | abhaya, apoorva enter quarters of tsta tourny | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో అభయ, అపూర్వ

Feb 19 2017 10:57 AM | Updated on Sep 5 2017 4:07 AM

తెలంగాణ రాష్ట్ర టెన్నిస్‌ సంఘం (టీఎస్‌టీఏ) మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో అభయ, అపూర్వ క్వార్టర్స్‌కు చేరుకున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్‌ సంఘం (టీఎస్‌టీఏ) మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో అభయ, అపూర్వ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. నేరెడ్‌మెట్‌లోని డీఆర్‌సీ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌లో శనివారం జరిగిన అండర్‌–12 బాలికల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ మ్యాచ్‌ల్లో అభయ వేమూరి 8–2తో తన్వి రెడ్డిపై గెలుపొందగా... అపూర్వ వేమూరి 8–0తో శ్రీనిధి రెడ్డిని ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో సౌమ్య 8–5తో రిధి చౌదరీపై, సాయి బృంద 8–3తో లక్ష్మీశ్రీపై, సమీనా 8–7 (5)తో శ్రీవల్లి వర్మపై, రత్న సహస్ర 8–0తో దివ్యపై, తిరుమల శ్రీయ 8–0తో ఖుషిరెడ్డిపై, మలిష్క 8–0తో త్రిభువనిపై విజయం సాధించారు. బాలుర తొలిరౌండ్‌ మ్యాచ్‌ల్లో శ్రీశరణ్‌ రెడ్డి 8–2తో త్రిశాంత్‌ రెడ్డిపై, శ్రీహరి 8–0తో సాకేత రామపై గెలుపొంది తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు.

ఇతర మ్యాచ్‌ల ఫలితాలు       

బాలుర తొలిరౌండ్‌: కోట శ్రీనాథ్‌ 8–3తో హృషిక్‌పై, ధరణి దత్త 8–0తో ధీరజ్‌ రెడ్డిపై, వినీత్‌ 8–5తో మొహమ్మద్‌ జైద్‌ జిహార్‌పై, రాజు 8–5తో రోహిత్‌ సాయిపై, వేదాంత్‌ మిశ్రా 8–3తో ఆర్మాన్‌ మిశ్రాపై, శౌర్య 8–5తో హేమంత్‌సాయిపై, తన్మయ్‌రెడ్డి 8–5తో అనిరుధ్‌పై, మోహిత్‌ సాయి 8–1తో అనీశ్‌ జైన్‌పై, అభిషేక్‌ కొమ్మినేని 8–3తో శాండిల్య పుల్లెలపై, త్రిశూల్‌8–6తో రోహన్‌పై, సిద్ధార్థ 8–4తో ఆదిత్య రెడ్డిపై, అనీశ్‌ రెడ్డి 8–3తో ధనుష్‌ వర్మపై విజయం సాధించారు.


బాలికల తొలిరౌండ్‌: రిధి చౌదరీ 8–7 (1)తో వెన్నెలపై, సాయిబృంద 8–0తో పూజితపై, లక్ష్మీశ్రీ 8–1తో శ్రీమన్య రెడ్డిపై, సమీనా 8–1తో రిషికపై, అభయ 8–0తో తేజ శ్రీవిద్యపై, శ్రీనిధి రెడ్డి 8–6తో మేధశ్రీపై, అపూర్వ 8–0తో సన లతీఫ్‌పై, తిరుమల శ్రీయ 8–4తో జి. శివానిపై, ఖుషిరెడ్డి 8–6తో భారతిపై, త్రిభువని 8–2తో తానియాపై గెలుపొందారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement