‘అదే కోహ్లిని గ్రేట్‌ ప్లేయర్‌ను చేసింది’

Aamer Sohail Compares Virat Kohli To Javed Miandad - Sakshi

కోహ్లికి మా దిగ్గజ క్రికెటర్‌తో పోలికలున్నాయి

పెద్ద ప్లేయర్లే.. జట్టుకు పెద్దగా ఉపయోగపడలేదు

యూట్యూబ్‌ చానెల్‌లో అమీర్‌ సొహైల్‌

కరాచీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ అమీర్‌ సొహైల్‌ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత క్రికెట్‌ శకంలో కోహ్లినే గ్రేట్‌ ప్లేయర్‌ అంటూ కొనియాడు. విరాట్‌ కోహ్లి ఆట ఎప్పుడూ చూడమచ్చటగా ఉంటుందని, అతను చూపరులను ఇట్టే ఆకర్షిస్తాడని ప్రశంసించాడు. తమ శకంలో తమ దిగ్గజ ఆటగాడు జావెద్‌ మియాందాద్‌ ఆట ఎంత ఆకర్షణీయంగా ఉండేదో అదే తరహా ఆట కోహ్లిలో ఉందంటూ పోల్చాడు. తన యూట్యూబ్‌ చానలె్‌లో మాట్లాడిన అమీర్‌ సొహైల్‌.. జావెద్‌ మియాందాద్‌కు కోహ్లికి చాలా దగ్గర పోలికలున్నాయన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో వీరిద్దరూ పెద్ద ఆటగాళ్లైనా వ్యక్తిగతంగా మాత్రమే సక్సెస్‌ ఎక్కువగా అయ్యారన్నాడు. ఓవరాల్‌గా చూస్తే జట్టుకు మాత్రం వీరి ప్రదర్శన పూర్తి స్థాయిలో ఉపయోగపడలేదన్నాడు. ప్రధానంగా మియాందాద్‌, కోహ్లిలు మేజర్‌ టోర్నీల్లో విఫలమైన సందర్భాన్ని సొహైల్‌ పరోక్షంగా ప్రస్తావించాడు. పాకిస్తాన్‌ క్రికెట్‌ చరిత్ర గురించి, గొప్పదనం గురించి చెప్పాలంటే తొలుత వినిపించే పేరు మియాందాద్‌దేనని అభిప్రాయపడ్డాడు. మియాందాద్‌ తన ఆట తీరుతో పాకిస్తాన్‌ క్రికెట్‌ను ఉన్నత శిఖరంలో నిలబెట్టాడనేది కాదనలేని వాస్తవమన్నాడు.(నన్ను ‘కాలూ’ అని పిలిచారు)

దీనిలో భాగంగా అతనితో ఆడిన సందర్భాల్ని సొహైల్‌ గుర్తు చేసుకున్నాడు. మియాందాద్‌తో కలిసి ఎన్నో భాగస్వామ్యాల్లో పాలుపంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. అతని నుంచి చాలా విషయాలను నేర్చుకోవడమే కాకుండా ఎంతో స్ఫూర్తి పొందానని సొహైల్‌ తెలిపాడు. అలానే కోహ్లి ద్వారా అనేక మంది యువ క్రికెటర్లు స్పూర్తి పొందుతున్నారన్నాడు. ఇప్పటికే గ్రేట్‌ ప్లేయర్‌ ట్యాగ్‌ను సంపాదించుకున్న కోహ్లి ఎంతో మందికి ఆదర్శమన్నాడు.అయితే కోహ్లి ఎలా గ్రేట్‌ ప్లేయర్‌ అయ్యాడనే విషయాన్ని కూడా సొహైల్‌ విశ్లేషించాడు.  కోహ్లిలో దూకుడు, బ్యాటింగ్‌లో ఆకట్టుకునే నైజం జట్టులో భాగమైపోయాయన్నాడు. ఆటే జీవితం అనే విషయాన్ని కోహ్లి తొందరగా తెలుసుకున్నాడు కాబట్టి ఆ గేమ్‌ అతన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టిందన్నాడు. సాధ్యమైనంతవరకూ ప్రొఫెషనల్‌ కెరీర్‌ను వ్యక్తిగత జీవితాన్ని దూరంగా ఉంచుతాడు కాబట్టే కోహ్లి గ్రేట్‌ ప్లేయర్‌గా ఎదిగాడన్నాడు. (గంగూలీని ఆశ్రయిస్తా : పాక్‌ మాజీ క్రికెటర్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top