జీవాధోని క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌

Ziva Dhoni Cute Expression While India Vs South Africa Match - Sakshi

లండన్‌ : భారత క్రికెట్ మాజీ సారథి, మహేంద్ర సింగ్ ధోనీ గారాల పట్టీ జీవాకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్‌తో ముద్దు ముద్దు మాటలతో కోట్ల మందిని తన అభిమానులుగా మార్చేసుకుంది జీవా. తల్లి సాక్షి ధోని సాయంతో ఆమె సొంత ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను కూడా హ్యాండిల్‌ చేస్తోంది. ధోని మైదానంలో ఉన్నప్పుడు తప్పక మ్యాచ్‌ను వీక్షించే ఈ లిటిల్‌ స్టార్‌ తాజా ప్రపంచకప్‌ నేపథ్యంలోనూ తల్లితో కలిసి ఇంగ్లండ్‌ పయనమైంది. ఎయిర్‌పోర్టులో దిగిన ఓ ఫొటోను ‘ట్రావెల్‌ టైమ్స్‌’ అని పోస్టు చేసింది. 
(కమాన్‌ పప్పా.. జీవాధోని హల్‌చల్‌)

ఇక బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సఫారీ జట్టు నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని కోహ్లి సేన 47.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ధోని 34 పరుగులు జోడించి జట్టు విజయంలో తనదైన పాత్ర పోషించాడు. ఇక ధోని బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో జీవా ఇచ్చిన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌పై నెటిజన్లు ముచ్చడపడ్డారు. ‘లిటిల్‌ స్టార్‌ డాడీ ఆటను ఎంజాయ్‌ చేస్తూ చీర్‌లీడర్‌గా మారారు’ అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, జీవా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు 98 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.
(పంత్‌కు పాఠాలు నేర్పిస్తున్న జీవా)

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top