టిక్‌టాక్‌ ప్రాణం తీసింది! | TikTok Video Goes Wrong And Student Dies After Speeding Bike Rams Into Bus | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన టిక్‌టాక్‌ సరదా!

Feb 23 2019 1:20 PM | Updated on Feb 23 2019 1:22 PM

TikTok Video Goes Wrong And Student Dies After Speeding Bike Rams Into Bus - Sakshi

టిక్‌టాక్‌ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది.

చెన్నై : టిక్‌టాక్‌ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ విచారకర ఘటన తమిళనాడులోని తంజావురులో చోటుచేసుకుంది. వినూత్నంగా వీడియో తీసి టిక్‌టాక్‌లో ఆకట్టుకోవాలన్న ముగ్గురు యువకుల ఆరాటం.. ఒకరిని బలిగొన్నది. సూర్యా, రైగాన్‌, విజ్ఞేష్‌ అనే ముగ్గురు యువకులు బైక్‌పై వెళ్తూ వినూత్నంగా వీడియో తీయాలనుకున్నారు. ఒకరు బైక్‌ రైడ్‌ చేస్తుండగా.. మరొకరు వీడియో తీశారు. అయితే కొంత దూరం సజావుగానే సాగిన వీరి ప్రయాణానికి ఊహించని షాక్‌ తగిలింది. వీడియో తీసే ఆరాటంలో ఎదురుగా వెళ్తున్న బస్సును వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ వీరిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ వీడియో టిక్‌టాక్‌ యాప్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

మొబైల్‌ యూజర్లను ఈ టిక్‌టాక్‌ యాప్‌ బ్లూవేల్‌ గేమ్‌ తరహా పీడిస్తోంది. ఈ యాప్‌లో లైక్స్‌, కామెంట్స్‌ కోసం యూజర్లు ఎంతటికైనా తెగిస్తున్నారు. గంటల తరబడి సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. ఏ మాత్రం హద్దు అదుపులేకుండా వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. దీంతో ఈ యాప్‌ను నిషేధించాలనే డిమాండ్‌ వ్యక్తం అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement