విరుష్కలను ఆడేసుకుంటున్న నెటిజన్లు | Kohli And Anushka Beach Pics Inspire Hilarious Memes | Sakshi
Sakshi News home page

విరుష్కలను ఆడేసుకుంటున్న నెటిజన్లు

Sep 13 2019 10:02 PM | Updated on Sep 13 2019 10:11 PM

Kohli And Anushka Beach Pics Inspire Hilarious Memes - Sakshi

సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ బారిన పడని సెలబ్రెటీలు ఉండరు. సినిమా, బుల్లితెర, రాజకీయం, క్రీడలతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రెటీలను టార్గెట్‌ చేస్తూ ట్రోలింగ్‌ చేస్తుంటారు. ఈ జాబితాలో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి అతడి సతీమణి అనుష్క శర్మలు ముందు వరుసలో ఉంటారు. సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే ఈ జంటను ట్రోలర్స్‌ ఓ ఆట ఆడేసుకుంటారు. తాజాగా ఓ బీచ్‌లో తన భార్య అనుష్క ఒడిలో పడుకుని తీసుకున్న ఓ సెల్ఫీని కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. 

అయితే ఈ ఫోటోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు నెటిజన్లు ఈ ఫోటో చూసి ‘నిజమైన ప్రేమకు అర్థం వీరే’ అని కామెంట్‌ చేస్తుండగా.. మరికొందరు నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 
విరాట్‌ షేర్‌ చేసిన ఫోటోపై ఫన్నీ మీమ్స్‌ క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం విరుష్కలకు సంబంధించిన మీమ్స్‌ నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ఈ ట్రోల్స్‌పై విరుష్కలు ఎలా స్పందిస్తారో చూడాలి.   


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement