కరోనా ఎఫెక్ట్‌: నాకొక బాయ్‌ఫ్రెండ్‌ కావాలి

Chinese Nurse Asks Govt To Assign Her Boyfriend - Sakshi

బీజింగ్‌: కరోనా వైరస్‌ ప్రస్తుతం చైనాతో సహా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలో అయితే డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది అవిశ్రాంతంగా విధులు నిర్వహిస్తూ సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. చైనాలో కరోనా బాధితులకు సేవలు చేస్తున్న తియాన్‌ ఫాంగ్‌ ఫాంగ్‌ అనే నర్సు ఓ కోరిక కోరింది. తనకు ఓ భాయ్‌ ఫ్రెండ్‌ను చూసి పెట్టమని ఏకంగా అక్కడి ప్రభుత్వానికే విజ్ఞప్తి చేసింది. అంతేగాక చివర్లో తన కోరిక ఇప్పుడు కాకపోయినా కరోనా మహమ్మారి అంతమయ్యాక అయినా తీర్చాలంటూ ఓ చిన్న సడలింపు కూడా ఇచ్చింది. చదవండి: కరోనా మమ్మల్ని చంపితే నువ్వూ చస్తావ్‌: వర్మ

ఈ మేరకు మెసేజ్‌తో కూడిన ఓ లెటర్ చూపిస్తూ.. హ్యాజ్‌మ్యాట్‌ సూట్‌లో, కళ్లకు గాగుల్స్‌ పెట్టుకొని ఆమె ఫొటో దిగి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. 'నేను బాయ్‌ఫ్రెండ్‌ను వెతుక్కునే పనిలో పడ్డాను. అప్పుడే కరోనా మహమ్మారి నా అన్వేషణకు అడ్డుకట్టవేసింది. అయినా నేను నా వ్యక్తిగత పనులు మాని నా విధులను అంకితభావంతో నిర్వర్తిస్తున్నాను. ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డాక బాయ్‌ఫ్రెండ్‌ను వెతికిపెట్టాలి. కరోనా గండం తప్పుతుంది. మంచి రోజులు వస్తాయనే నమ్మకాన్ని ప్రజల్లో వ్యాపింపజేయటానికి ఆజానుభావుడైన బాయ్‌ఫ్రెండ్‌ను వెదకాలని' ప్రభుత్వాన్ని కోరినట్లు తియాన్‌ చెప్తోంది.
చదవండి: ఇక క్షణాల్లో కరోనా వైరస్‌ను గుర్తించవచ్చు! 

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top