చంద్రబాబు అవినీతి వల్లే..

YSRCP Leaders Slam Chandrababu Naidu - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ విమర్శించారు. అసలు పూటకో మాట మాట్లాడే చంద్రబాబు రాజకీయాలకు పనికిరారని మండిపడ్డారు. ప్రస్తుతం కేంద్రంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ప్రధాన కారణం ప్రజల్లో విశ్వాసం కోల్పోవడమేనని వరప్రసాద్‌ ఎద్దేవా చేశారు. ప్రధానంగా చంద్రబాబు అవినీతి, అసమర్థత వల్ల ఏపీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఏపీకి బీజేపీ-టీడీపీ రెండూ ద్రోహం చేశాయన్న వరప్రసాద్‌.. చంద్రబాబు ద్రోహి నంబర్‌వన్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.

ప్రత్యేక హోదా కోసం మొదట ఆమరణ దీక్ష చేసింది మాత్రం ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అనే విషయాన్ని ఈ సందర్భంగా వరప్రసాద్‌ గుర్తు చేశారు. ప్రత్యేకహోదా అనేది నేటికీ సజీవంగా ఉందంటే అందుకు కారణం జగనేనన్నారు. ఏపీకి హోదా కోసం ఏమేమి చేయాలో అన్నింటినీ వైఎస్సార్‌సీపీ చేసిందన‍్నారు. తాము కేంద్రంపై 13సార్లు అవిశ్వాసాన్ని పెట్టినా చర్చకు అనుమతి ఇవ్వలేదన్నారు. లోక్‌సభలో టీడీపీ ఎంపీలు సృష్టించిన గందరగోళం కారణంగానే తాము పెట్టిన అవిశ్వాసంపై చర్చకు రాలేదన్నారు. ఇదే విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌ కూడా సభ సాక్షిగా చెప్పిన విషయాన్ని వరప్రసాద్‌ పేర్కొన్నారు. ఇకనైనా అవకాశ వాద రాజకీయాలను టీడీపీ వదిలిపెట్టాలని హితవు పలికారు. ఇప్పటికైనా బీజేపీ..  ఏపీకి హోదాను ప్రకటిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.

మరోనేత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ..‘ మేము అవిశ్వాసం పెట్టినప్పుడు అవహేళన చేశారు. ఇప్పడు మధ్యలో వచ్చి నేనే చాంపియన్‌ అని చంద్రబాబు అంటున్నారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి.. ప్యాకేజీకి ఒప్పుకుంది చంద్రబాబు. ఎవరు ఎలా చేస్తున్నారో ఏపీ ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు ఆలోచనంతా జగన్‌ను ఇబ్బంది పెట్టడంపైనే. చంద్రబాబు-మోదీ రాష్ట్రానికి చాలా ద్రోహం చేశారు’ అని వ్యాఖ్యానించారు.

సంబంధిత కథనాలు:

నేడే అవిశ్వాసం

టీడీపీ అవిశ్వాస తీర్మానం వెనుక కేంద్ర సర్కార్‌ కనుసైగ!

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top