ఉండవల్లి అప్పుడు ఏం చేశారు: సోము వీర్రాజు

what is the role of Undavalli at State Division: somu - Sakshi

సాక్షి, రాజమండ్రి: పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది బీజేపీయేనని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు రూ.4వేల కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. ముంపు మండలాలను ఆంధ్రాలో కలిపింది కూడా బీజేపీయేనని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు ఆంధ్రా అభివృద్ధి గుర్తుకు రాలేదా.. పార్లమెంటులో రాష్ట్రాన్ని విడదీసినపుడు అప్పటి ఎంపీ ఉండవల్లి ఏం చేశారు.. భద్రాద్రి రాముడు తెలంగాణకు వెళ్ళినపుడు ఉండవల్లి ఏమీ చేయలేకపోయారు ఎందుకు అని ప్రశ్నించారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన అనంతరం విశాఖ రైల్వే జోన్ కోసం బీజేపీ యత్నిస్తుందని సోము అన్నారు. ‘ఉపాధి’ పథకం కొందరు అవినీతిపరులకు ఉపాధిగా మారిందన్నారు. 2019 ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీయే ప్రధాని అని, ముందస్తు ఎన్నికలపై మోడీదే తుది నిర్ణయం అని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక, మద్యం మాఫియాలను అరికట్ట లేకపోతోందని వీర్రాజు విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top