కాంగ్రెస్‌ ఓర్వలేకపోతోంది | We will open the closed houses in Congress rule | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఓర్వలేకపోతోంది

Oct 26 2017 2:50 AM | Updated on Mar 18 2019 7:55 PM

We will open the closed houses in Congress rule - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం జనరంజకంగా పాలిస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్‌ పార్టీ అర్థంపర్థంలేని ఆరోపణలు చేస్తోందని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. వారి వ్యవహారం చివరకు ఆ పార్టీకే నష్టం చేస్తుందన్నారు. సుదీర్ఘ పాలనా అనుభవం ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అర్ధవంతమైన చర్చ జరిగేలా పాలక పక్షానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం మధ్యాహ్నం ఆయన సచివాలయంలోని తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. రైతులకు మేలుచేసేలా భూప్రక్షాళన జరుగుతుంటే ప్రతిపక్షాలు విమర్శించటం విడ్డూరంగా ఉందని, రైతులకు నీళ్లిస్తుంటే తప్పుడు ఆరోపణలు చేయటం వారి ఓర్వలేనితనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌ హయాంలో మూతపడ్డ సంస్థలను తాము పునరుద్ధరిస్తున్నామని చెబుతూ రామగుండంలో ఎఫ్‌సీఐని తిరిగి ప్రారంభిస్తున్నట్టు తుమ్మల గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement