రాహుల్‌ గాంధీని పోరాడమంటాం: రఘువీరా

We Will Cancel CPS Syatem Said By APCC President Raghuveera Reddy - Sakshi

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా వస్తే డబ్బులు ఎక్కువగా వస్తాయని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరా రెడ్డి అన్నారు.  ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హైదరాబాద్‌ నుంచి రాహల్‌ గాంధీ ప్రకటన చేశారని గుర్తు చేశారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ విజయవాడలో రైల్వే స్టేషన్ నుంచి జింకానా గ్రౌండ్స్‌ వరకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. వీరికి రఘువీరారెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పటికే సీపీఎస్‌ రద్దు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిందని, ఏపీలో కూడా అధికారంలోకి వస్తే సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు సీపీఎస్‌ రద్దుకు డిమాండ్‌ చేయాలన్నారు.

సీపీఎస్‌ రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, సీపీఎస్‌ నిర్బంధంగా అమలు చేయాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదని అన్నారు. అక్టోబర్‌ 2 లోపు సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామని, లేని పక్షంలో ఉద్యోగులతో పాటు కాంగ్రెస్‌ పార్టీ పోరాటానికి దిగుతుందని హెచ్చరించారు. సీపీఎస్‌ రద్దు చేయాలని జాతీయ స్థాయిలో రాహుల్‌ గాంధీ పోరాటం చెయ్యాలని కోరతామని వెల్లడించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top