‘అలా చేయకపోతే.. మా పిల్లలు బిచ్చగాళ్లు అవుతారు’ 

V Hanumantha Rao Comment On OBC Commission - Sakshi

సాక్షి, ఢిల్లీ : క్రిమిలేయర్‌ ఎత్తివేయాలని గతంలో చాలాసార్లు కోరానని.. క్రిమిలేయర్‌ను ఎత్తివేయకపోతే తమ పిల్లలు బిచ్చగాళ్లు అయిపోతారని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. సోమవారం ఓబీసీ కమీషన్‌ తెలంగాణ ప్రాంతానికి వస్తున్న నేపథ్యంలో వీహెచ్‌ మాట్లాడుతూ.. 1993లో ఓబీసీ కమీషన్‌ ఏర్పడిందని అయినా బీసీలకు ఉద్యోగ అవకాశాల్లో 9శాతం కంటే ఎక్కువ దాటడం లేదని పేర్కొన్నారు. కమిటీ కొన్ని కులాలను బీసీల్లో కలుపుతామని అంటున్నారు.. అయితే తాను దానికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు.

ఏడాదికి 8లక్షలు దాటితే రిజర్వేషన్‌ వర్తించదని, బీసీ సర్టిఫికేట్ ఇవ్వడం లేదని అన్నారు. తమ పిల్లలకు, చదువు, ఉద్యోగ అవకాశాలు రావడం లేదని అన్నారు. క్రిమిలేయర్‌ వల్ల తమకు వచ్చే ఉద్యోగాలు అగ్ర కులాలకు పోతున్నాయని తెలిపారు. గతంలో బైసన్‌పోలో గ్రౌండ్‌ విషయంలో తాను పబ్లిక్‌ పోల్‌ ఒపీనియన్‌ తీసుకున్నప్పుడు 97శాతం మంది ప్రజలు వారి స్పందన తెలిపారన్నారు. అలాగే మళ్లీ ఇప్పుడు కొత్త సచివాలయం నిర్మాణంపై పబ్లిక్‌ ఒపీనియన్‌ అడగుతామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top