‘జగన్‌ నిర్ణయం రాజకీయాల్లో సంచలనం’

Ummareddy Reacts On YS Jagan Cabinet With Five Deputy CMs - Sakshi

సాక్షి, తాడేపల్లి : కేబినెట్‌ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లో సంచలనమని వైఎస్సార్ సీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభివర్ణించారు. వైఎస్సార్‌ఎల్పీ సమావేశంలో అందరికీ సమ న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు అద్భుతమైన పాలన చూస్తారని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. అలాగే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పదవులను బాధ్యతగా తీసుకోవాలని వైఎస్‌ జగన్‌ చెప్పారని, ధర్మానికి, న్యాయానికి అండగా ఉండాలని చెప్పారన్నారు.

చదవండి : ఏపీ సీఎం వైఎస్ జగన్‌ సంచలన నిర్ణయం

కాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన మంత్రివర్గంలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తానంటూ వైఎస్సార్‌ఎల్పీలో చేసిన ప్రకటన కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు అవకాశం కల్పించనున్నారు. ఇది దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం. బడుగు, బలహీన వర్గాలకు చెందిన అందరికీ ప్రాతినిధ్యం కల్పించాలన్న లక్ష్యంతో అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారి.  అత్యంత ఉన్నత స్థానాల్లో సామాజిక వర్గాలవారిగా సమ ప్రాధాన్యత కల్పించే కీలక నిర్ణయం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top