‘ఇప్పుడు గెలిస్తేనే ఉన్నత హోదాలో ఉంటా’

Three TRS MPs Will Join In Congress Says Shabbir Ali - Sakshi

సాక్షి, కామారెడ్డి : మరోసారి తనకు కామారెడ్డిలో ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని, ఈ ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపిస్తే ఉ‍న్నత హోదాలో ఉంటానని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే వస్తుందని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో కుటుంబపాలన పోయి మార్పు రావాలంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వాన్ని మార్చే శక్తి ప్రజలకు మాత్రమే ఉందన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ ఓటమి ఖాయమని, అక్కడ వంటేరు ప్రతాప్‌ రెడ్డి గెలుస్తారని చెప్పారు. కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా టీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ షాక్‌ అని అన్నారు. ఆయన బాటలో మరో ముగ్గురు ఎంపీలు కాంగ్రెస్‌లో చేరటానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top