నన్ను ఎదుర్కోలేకే విష ప్రచారం

Thippala Nagireddy Slams TDP Leaders in Visakhapatnam - Sakshi

నన్ను ఎదుర్కోలేకే విష ప్రచారం

అద్దె వివాదానికి రాజకీయరంగు పులమడం దుర్మార్గం

పిట్టా నాగేశ్వరరావు  బీజేపీ సీనియర్‌ కార్యకర్త

నీచ వార్తలు రాయడం ఎల్లోమీడియాకు కొత్తకాదు

ఘాటుగా స్పందించిన నాగిరెడ్డి

విశాఖపట్నం  , గాజువాక : పెదగంట్యాడలో చోటుచేసుకున్న అద్దె వివాదంలోకి వైఎస్సార్‌సీపీని లాగి తనపై దుష్ప్రచారం చేయాలనుకోవడం దుర్మార్గమని ఆ పార్టీ అభ్యర్థి, సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి అన్నారు. జనసేన నాయకులు రాజకీయంగా తనను ఎదుర్కోలేకే ఇలాంటి నీచపు ఆరోపణలకు దిగజారారని మండిపడ్డారు. గాజువాక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగిరెడ్డి మాట్లాడారు. తమ పార్టీ ప్రచారానికి రాలేదని ఒక నిండు గర్భిణిని కొట్టారంటూ ఎల్లోమీడియాలో వార్తలు రాయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం తోక పత్రికకు  కొత్త కాదన్నారు. బాధితురాలు ఎవరో తనకు తెలియదని, ఇంటి యజమాని తమ పార్టీ కాదని పేర్కొన్నారు. ఆయన బీజేసీ సీనియర్‌ కార్యకర్త అని తెలిపారు. పిట్టా నాగేశ్వరరావు రెడ్డి కులానికి చెందినవాడైతే వైఎస్సార్‌సీపీ నాయకుడవుతాడా అని ప్రశ్నించారు.

గాజువాకలో తన గెలుపు తథ్యమని ప్రజలు చెబుతున్నారని, దీంతో జనసేన నాయకులకు ఏం చేయాలో అర్థంకాక బురద జల్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జనసేన నాయకులు,ఎల్లోమీడియా ఇప్పటికైనా ఇలాంటి నీచ రాజకీయాలు, దిగజారుడు రాతలను మానుకోవాలని హితవు పలికారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి తగిన విధంగా గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో గాజువాక ఎన్నికల పరిశీలకుడు సత్తి రామకృష్ణారెడ్డి, నాయకులు మార్టుపూడి పరదేశి, మళ్ల బాపునాయుడు, రాజాన వెంకటరావు, రెడ్డి జగన్నాథం, వెంపాడ అప్పారావు, పల్లా చినతల్లి, కొయ్య భారతి, నక్క వెంకట రమణ, ఎన్నేటి రమణ, నక్క రమణ, రాజాన రామారావు, గండ్రెడ్డి రామునాయుడు, ఏదూరి రాజేష్, సంపంగి ఈశ్వరరావు, కటికల కల్పన, భూపతిరాజు సుజాత, కె.శ్రీదేవి, జి.రోజారాణి, ఎన్‌.ఎమీమా, ఎం.గంగాభాయి, ధర్మాల శ్రీను, మొల్లి చిన్న, చిత్రాడ వెంకట రమణ, పూర్ణశర్మ, సాపే బ్రహ్మయ్య, వై.మస్తానప్ప, రంబ నారాయణమూర్తి, దాడి నూకరాజు, ప్రగడ వేణుబాబు, బొడ్డ గోవింద్, బోగాది సన్ని, గొంతిన చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top