ఎగ్జిట్‌ పోల్స్‌.. ఉత్కంఠ

Tension Builds Up In Political Camps On Exit Polls - Sakshi

న్యూఢిల్లీ‌: సార్వత్రిక ఎన్నికల సమరం కాసేపట్లో ముగియనుంది. తుది విడత ఎన్నికల పోలింగ్‌ ముగిసిన వెంటనే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడనున్నాయి. 542 లోక్‌సభ స్థానాలతో పాటు, నాలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎవరెవరు గెలుస్తారనేది ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా కట్టనున్నాయి. ఈ సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల కోసం రాజకీయ పార్టీలతో పాటు దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ఫలితాలపై అన్ని వర్గాల్లోనూ అమితాసక్తి నెలకొంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఎన్ని సీట్లు సాధిస్తాయనే దానిపై స్పష్టత వచ్చే అవకాశముంది. కేంద్రంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు కీలక ప్రాంతీయ పార్టీల విజయావకాశాలు ఎలా ఉంటాయనేది ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేయనున్నాయి. వీటి ద్వారా తుది ఫలితాలపై అంచనాకు వచ్చే అవకాశముండటంతో ప్రజలంతా ఎగ్జిట్‌ పోల్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు. తమ జాతకాలు ఎలా ఉంటాయనే దానిపై అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది. ఓట్ల లెక్కింపు ఈనెల 23న జరగనున్న సంగతి తెలిసిందే. (చదవండి: ఎగ్జిట్‌ పోల్స్‌పై ఈసీ కీలక ఆదేశాలు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top