‘రైతుబంధు’ రాబందుల భోజ్యం

Telangana Jana Samithi Leaders Slams On KCR - Sakshi

పెద్దపల్లిటౌన్‌: రైతుబంధు పథకం ద్వారా అన్నదాతకు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అంది స్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌ కుట్రపూరితంగా రాబందులకు మేలు చేసేందుకే ఈ పథకాన్ని అమలులోకి తెచ్చాడని తెలంగాణ జనసమితి ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి గాదె ఇన్నయ్య ఆరోపించారు. మంగళవారం పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతూ నాలుగు స్తంభాలాటగా మారిపోయిందన్నారు. భూశుద్ధీకరణ పేరుతో ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని రైతుల ను మోసం చేసిందన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రికార్డుల్లో చిన్నచితకా తప్పులుండేవని, ఇప్పుడు అసలు రికార్డులకే ఎస రు పెట్టారన్నారు. గతంలో పహణీ నకల్, పట్టాదారు పాస్‌ పుస్తకం, టైటిల్‌ డీడ్, ఈసీ వగైరా రికార్డులను సరిచూసుకొని, మార్టిగేజ్‌ చేసుకొని బ్యాంకులు పంట రుణాలు అందించేవని గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్‌ ప్రభుత్వం ఆన్‌లైన్‌ పహణీలను అందించక పోవడంతో రైతులకు బ్యాంకు లు రుణాలివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.

భూ రికార్డుల శుద్ధీకరణ కార్యక్రమా న్ని దేశంలోనే గొప్పదంటూ రెవెన్యూ అధికారులు అద్భుతంగా పని చేసి, చరిత్ర సృష్టించారంటూ పొగిడిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదే నోటితో రెవె న్యూ అధికారులు తప్పుడు తడకలుగా రికార్డులు రూపొందించారంటూ నిందించడం ఆయనకే చెల్లిందన్నారు. బ్యాంకులో రుణాలివ్వక, పెట్టుబ డి సాయం అందక చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం ప్రచార ఆర్భాటాలకు ఖర్చు చేసిన కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, సంక్షేమాన్ని విస్మరించిందని దుయ్యబట్టారు.

ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈనెల 23న అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్‌ ఎదుట రైతుదీక్ష చేపడుతున్నామన్నారు. రైతులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసేలా జనసమితి కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రైతుదీక్ష పోస్టర్‌లను ఆవిష్కరించారు. నాయకులు జేవీ రాజు, డొంకెన రవి, పెంట రాజే శ్, వెంకటమల్లయ్య, పిల్లి చంద్రశేఖర్‌ ముదిరాజ్, బెక్కం ప్రశాంత్, పొన్నం విజయ్‌కుమార్, చల్లా ప్రవీణ్‌కుమార్, భారతీ, లక్ష్మి, లావణ్య, వెంకటేశ్, చింటు, నరేందర్, విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top