breaking news
innaiah
-
‘రైతుబంధు’ రాబందుల భోజ్యం
పెద్దపల్లిటౌన్: రైతుబంధు పథకం ద్వారా అన్నదాతకు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అంది స్తానని చెప్పిన సీఎం కేసీఆర్ కుట్రపూరితంగా రాబందులకు మేలు చేసేందుకే ఈ పథకాన్ని అమలులోకి తెచ్చాడని తెలంగాణ జనసమితి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి గాదె ఇన్నయ్య ఆరోపించారు. మంగళవారం పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతూ నాలుగు స్తంభాలాటగా మారిపోయిందన్నారు. భూశుద్ధీకరణ పేరుతో ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని రైతుల ను మోసం చేసిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రికార్డుల్లో చిన్నచితకా తప్పులుండేవని, ఇప్పుడు అసలు రికార్డులకే ఎస రు పెట్టారన్నారు. గతంలో పహణీ నకల్, పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్, ఈసీ వగైరా రికార్డులను సరిచూసుకొని, మార్టిగేజ్ చేసుకొని బ్యాంకులు పంట రుణాలు అందించేవని గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం ఆన్లైన్ పహణీలను అందించక పోవడంతో రైతులకు బ్యాంకు లు రుణాలివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. భూ రికార్డుల శుద్ధీకరణ కార్యక్రమా న్ని దేశంలోనే గొప్పదంటూ రెవెన్యూ అధికారులు అద్భుతంగా పని చేసి, చరిత్ర సృష్టించారంటూ పొగిడిన ముఖ్యమంత్రి కేసీఆర్ అదే నోటితో రెవె న్యూ అధికారులు తప్పుడు తడకలుగా రికార్డులు రూపొందించారంటూ నిందించడం ఆయనకే చెల్లిందన్నారు. బ్యాంకులో రుణాలివ్వక, పెట్టుబ డి సాయం అందక చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం ప్రచార ఆర్భాటాలకు ఖర్చు చేసిన కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, సంక్షేమాన్ని విస్మరించిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈనెల 23న అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ ఎదుట రైతుదీక్ష చేపడుతున్నామన్నారు. రైతులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసేలా జనసమితి కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రైతుదీక్ష పోస్టర్లను ఆవిష్కరించారు. నాయకులు జేవీ రాజు, డొంకెన రవి, పెంట రాజే శ్, వెంకటమల్లయ్య, పిల్లి చంద్రశేఖర్ ముదిరాజ్, బెక్కం ప్రశాంత్, పొన్నం విజయ్‌కుమార్, చల్లా ప్రవీణ్‌కుమార్, భారతీ, లక్ష్మి, లావణ్య, వెంకటేశ్, చింటు, నరేందర్, విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. -
టీఆర్ఎస్కు బుద్ధిచెప్పాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను సాధించుకోవడానికి ప్రత్యామ్నాయ రాజకీయశక్తి అవసరమని ప్రజా తెలంగాణ పార్టీ కన్వీనర్ గాదె ఇన్నయ్య అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులు, యువకుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో అమరవీరుల ఆశయాలను, ఉద్యమ ఆకాంక్షలను విస్మరిస్తున్న టీఆర్ఎస్కు ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్పాలన్నారు. నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కును హరిస్తూ, ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెట్టి అనైతిక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అధికారం నుంచి దించాలన్నారు. తెలంగాణ వచ్చినా రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగుల బలిదానాలు, భూ నిర్వాసితుల సమస్య, సింగరేణిలో కార్మికుల ఇబ్బందులు కొనసాగడం బాధాకరమన్నారు. నిరుద్యోగులు, భూ నిర్వాసితులు, అణచివేతకు గురవుతున్న వర్గాలకోసం పోరాడుతున్న కోదండరాం నేతృత్వంలో పార్టీ రావడం అవసరమన్నారు. -
ఆర్డీటీ మాజీ చైర్మన్ ఇన్నయ్య మృతి
అనంతపురం సప్తగిరి సర్కిల్: రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ) మాజీ చైర్మన్ ఇన్నయ్య ఫాదర్(85) బుధవారం మృతి చెందారు. ఆయన కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం బెంగుళూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 10 గంటలకు మృతి చెందారు. గురువారం ఆయన మృతదేహాన్ని ఆర్డీటీ కార్యాలయానికి తరలించగా, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్, డైరెక్టర్లు చంద్రశేఖర్ నాయుడు, దశరథ్, జేవియర్, మల్లారెడ్డి, డోరిన్‌రెడ్డి, మోహన్ మురళి తదితరులు నివాళులర్పించారు.