బీసీలను అణగదొక్కాలని చూస్తున్నాయి: జాజుల | Srinivas goud commented on bc's | Sakshi
Sakshi News home page

బీసీలను అణగదొక్కాలని చూస్తున్నాయి: జాజుల

Sep 21 2018 1:14 AM | Updated on Sep 21 2018 1:14 AM

Srinivas goud commented on bc's - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జనాభాలో సగ భాగంఉన్న బీసీలకు రాయితీలతో సరిపెట్టి..తమను వారి చెప్పుచేతల్లో పెట్టుకోవాలని రాజకీయ పార్టీలు చూస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీని వాస్‌గౌడ్‌ ధ్వజమెత్తారు. పార్టీలతో నిమిత్తం లేకుం డా బీసీలను రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్నాయన్నారు.

గురువారం ఇక్కడ బీసీల సంక్షేమ సంఘం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. బీసీల రాజకీయ సాధికారత కోసం త్వరలో బీసీ రాజకీయ సమితిని ఏర్పాటు చేయనున్నట్లు జాజుల ప్రకటించారు. పది రోజుల్లో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ, ప్రతి నియోజకవర్గంలో ఆత్మగౌరవ సభలు, ‘ఓటు మనదే సీటు మనదే’ నినాదంతో ఎన్నికల బరిలో ఉండటంతో సహా పలు తీర్మానాలను సమావేశం ఆమోదించింది.

Advertisement
 
Advertisement
Advertisement