సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ

Revanth Reddy Writes Open Letter To KCR Over Constable Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ పోలీసు కానిస్టేబుల్స్ నియామక పరీక్షలకు సంబంధించిన మెరిట్‌ లిస్ట్‌, కటాఫ్‌ మార్కులు తక్షణమే విడుదల చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఫలితాల విడుదలపై స్పష్టత లేక ఐదు నెలలుగా అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని, ప్రైవేట్‌ హాస్టళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆరోపించారు. 90 వేల మంది నిరుద్యోగ యువతకు సంబంధించిన ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ తక్షణమే జోక్యం చేసుకొని కటాఫ్‌ మార్కులు, మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేయమని డీజీపీ, బోర్డు చైర్మన్‌లను ఆదేశించాలని కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top