రమ్య వర్సెస్‌ రాజీవ్‌ | rajeev chandrashekar and ramya in twitter war | Sakshi
Sakshi News home page

రమ్య వర్సెస్‌ రాజీవ్‌

Feb 7 2018 8:23 AM | Updated on Feb 7 2018 8:23 AM

rajeev chandrashekar and ramya in twitter war - Sakshi

రమ్య , రాజీవ్‌ చంద్రశేఖర్‌

సాక్షి, బెంగళూరు: రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ట్విట్టర్‌ బాట పట్టాయి. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ ట్వీట్లతో హోరెత్తించిన కాంగ్రెస్‌ మాజీ ఎంపీ రమ్యపై బీజేపీ అదేస్థాయిలో ట్వీటర్‌లో విమర్శనాస్త్రాలు గుప్పిస్తోంది. రమ్యతో పాటు సీఎం సిద్ధరామయ్యను కౌంటర్‌ చేస్తూ బీజేపీ నేతలు ట్వీట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీని విమర్శిస్తూ ముఖ్యమంత్రి చేసిన ట్వీట్లపై మంగళవారం రాజ్యసభ ఎంపీ రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పందించారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు అన్ని విషయాలపై మాట్లాడుదాం అంటూ రాజీవ్‌ ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్‌కు రమ్య స్పందించారు. రాజీవ్‌కు రీట్వీట్‌ చేస్తూ కోరమాంగళలోని స్థలాన్ని కేఎంఎఫ్‌కు, హసన్‌లోని స్థలాన్ని సెజ్‌కు, కేఐఏడీబీ కింద డబాస్‌పేటలో ప్లాంట్‌ ఏర్పాటుకు చేసిన భూసమీకరణ, బెంగళూరు విమానాశ్రయానికి 75 ఎకరాల భూమి మంజూరుపై చర్చకు సిద్ధమా అని ఆమె ట్వీట్‌ చేశారు. వీటితో పాటు లోక్‌పాల్‌ బిల్లు, న్యాయమూర్తి లోహియా మృతి, అమిత్‌ షా మాటలపై చర్చించేందుకు సిద్ధరామయ్య సిద్ధమా అని ట్వీట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement